అక్కినేని నాగచైతన్య, సమంత జంట తెరపై ప్రేమను అద్భుతంగా పండించిన ఈ జంట. నిజజీవితంలోనూ ప్రేమికులుగా మారి, పెళ్లివైపు అడుగులేసింది. పెళ్లి తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ కలిసి నటించే సినిమాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలో వీరిద్దరూ మళ్లీస్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ, దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో చైతూ, సామ్ కలిసి నటించబోతున్నారు. విశేషం ఏంటంటే ఇందులో వీళ్లిద్దరూ నిజజీవితంలో మాదిరిగానే భార్యభర్తలుగా కన్పించనున్నారు.