ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇప్పుడు అందరి చూపు ఆమె వైపే

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 14, 2018, 04:40 PM



గత ఏడాది విజయ్ దేవరకొండ సరసన అర్జున్ రెడ్డి సినిమా లో బోల్డ్ గా అంటే హాట్ హాట్ లిప్ లాక్ కిస్సులతో అదరగొట్టే పెరఫార్మెన్స్ ఇచ్చిన కొత్త అమ్మాయి షాలిని పాండే కి ఆ సినిమా తో మంచి పేరొచ్చింది. ఇక ఆ సినిమాతో చాలామంది దర్శకనిర్మాతల చూపు షాలిని పై పడింది. కాకపోతే అర్జున్ రెడ్డి తర్వాత ఓ అన్నంత అవకాశాలు రాకపోయినా… అమ్మడుకి పేరున్న పాత్రలైతే దక్కాయి. తెలుగులో మహానటి సినిమాలో సావిత్రి స్నేహితురాలి పాత్రలో నటించిన షాలిని పాండే తాజాగా కళ్యాణ్ రామ్ సినిమాలో చేస్తుంది. ఇక కోలీవుడ్ లో అయితే షాలిని కెరీర్ బాగుంది. 100 పెర్సెంట్ కాదల్ సినిమాతో పాటుగా తో మరో రెండు సినిమాలు అమ్మడు చేతిలో ఉన్నాయి.


ఇప్పుడు షాలిని పాండే వలె మరో హీరోయిన్ కూడా ఆ లిస్ట్ లోకొచ్చేసింది. ఆ అమ్మాయి ఎవరో కాదు RX 100 సినిమాలో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్ ఫుట్. మరి గత గురువారం విడుదలైన RX 100 సినిమా యావరేజ్ టాక్ తో సూపర్ కలెక్షన్స్ తో.. మెల్లగా పుంజుకుంటుంది. ఈసినిమాలో కార్తికేయ నటన కన్నా పాయల్ నటనకే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. కోరికలు తీర్చుకోవడం కోసం హీరోని ముగ్గులోకి దింపి చివరికి అతని చావుకు కూడా కారణమయ్యే క్రూరమైన పాత్రలో పాయల నటన చాల బావుందంటున్నారు. ఆ సినిమా లో ఆమె నటనకు మెచ్చిన చాలామంది దర్శక నిర్మాతల చూపు ఇప్పుడు ఆ అమ్మాయి మీద పడింది.


మరి RX 100 లో అంతలాంటి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించే సాహసం చెయ్యడానికి ఏ హీరోయిన్ అయినా వెనుకాడుతుంది. మరి షాలిని పాండే వలె పాయల్ రాజపుట్ కూడా ఏమాత్రం తన పాత్ర చెయ్యడానికి వెనుకాడకుండా చెయ్యడంతో… ఆ సినిమా తో హీరో కన్నా తనకే ఎక్కువ పేరు తెచ్చుకుంది. మరి ఆ సినిమా విజయంలో హీరోయిన్ పాయల్ కీలక పాత్ర పోషించింది. ఇక చూడడానికి అంటే లుక్స్ పరంగా పాయల్ చాలా బావుంటుంది. డీసెంట్ గా కనిపించే ఆ అమ్మాయి RX 100 లో అలాంటి నటన ఇచ్చింది అంటే ఆ అమ్మాయిలో చాలా టాలెంట్ ఉందనే భావన అందరిలో వచ్చేస్తుంది. మరి RX 100 సినిమాతో పాయల్ రాజపుట్ కి ఎలాంటి ఆఫర్స్ తలుపు తడతాయో చూద్దాం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com