అ!’ సినిమాలో డ్రగ్స్‌కి బానిసైన అమ్మాయిగా రెజీనా కనబరిచిన నటనను ఇప్పటికీ గుర్తు చేసుకునే ప్రేక్షకులు, చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ ఏడాది వచ్చిన చిత్రాల్లో ‘అ!’ అందరి దృష్టిని ఆకర్షించడమే కాదు... అందులో రెజీనా పాత్రకు ప్రశంసలు దక్కాయి. ‘అ!’ విడుదలై ఐదు నెలలవుతోంది. అప్పట్నుంచి ఇప్పటివరకూ పలు కథలు విన్న ఆమె, తాజాగా ‘నిన్ను వదిలి నేను పోలేనులే’కి సంతకం చేశారు. నిజార్ షఫీ దర్శకత్వంలో రమేశ్‌వర్మ నిర్మిస్తున్న ఈ సినిమాలో రెజీనా పోలీస్‌గా కనిపించనున్నారు. కృష్ణవంశీ ‘నక్షత్రం’లో ఆమె కాసేపు పోలీస్ డ్రస్‌లో సందడి చేశారు. అయితే.. అది పోలీస్ పాత్ర కాదు. పోలీస్‌గా ఆమె కనిపించనున్న తొలి చిత్రమిదే. హవీష్, అదితీ ఆర్య, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్ ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం.