సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం శివకాశీపురం. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి మనవడు రాజేష్ శ్రీ చక్రవర్తి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. హరీష్ వట్టికూటి దర్శకత్వంలో మోహన్‌బాబు పులిమామిడి ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయిన ఈ చిత్రాన్ని ఆగస్టు 3న విడుదల చేస్తున్నారు.
నిర్మాత మాట్లాడుతూ అందరి సహకారంతో ఓ మంచి చిత్రం నిర్మించామనే సంతృప్తి కలిగింది. నిర్మాణంపరంగా ఎక్కడా రాజీపడలేదు. మంచి ప్రచారంతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ నాకు ఇది తొలి సినిమా అయినప్పటికీ, యూనిట్ అందించిన సహకారంతో బాగా తీయగలిగాను. ఇదొక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. మంచిర్యాల, కాజీపేట, గాంధారి ఖిల్లాలలో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు, పాటలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి అన్నారు.
ఈ చిత్రంలో రాజేష్ శ్రీచక్రవర్తి, ప్రియాంక శర్మ, చమ్మక్ చంద్ర, సూర్య, సత్యప్రియ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం పవన్ శేషా, ఛాయాగ్రహణం జయ జి.రామిరెడ్డి, విడుదల పర్యవేక్షణ విఎస్. విజయవర్మ.