గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తనకంటే వయసులో పది సంవత్సరాలు చిన్న అయిన అమెరికన్ సింగర్ నిక్ జొనాస్‌తో డేటింగ్లో ఉందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే గతంలోనూ తన కంటే బాగా పెద్దవయసు వారితో సన్నిహితంగా మెలిగాడు నిక్. తనకంటే 13 ఏళ్లు పెద్దయిన కేట్ హడ్సన్, 8 ఏళ్లు పెద్దయిన డెల్టా గోడ్రెమ్తోనూ నిక్ డేటింగ్లో చేశాడు. అయితే ముదురు భామలతోనే డేటింగ్‌కు ఎందుకు ఇష్టపడతాడో నిక్ వెల్లడించాడు. ఆండీ కోహెన్ షోలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు నిక్ నవ్వుతూ బదులిస్తూ వయసుపై తాను ఎలాంటి పరిమితి విధించుకోలేదని..తన కంటే వయసులో పెద్దవారు వారేం కోరుకుంటారో వారికి తెలుస్తుందని చెప్పాడు. తాను డేటింగ్లో ఉన్నవారిలో అధిక వయసు 35 సంవత్సరాలని పరోక్షంగా ప్రియాంకను ఉద్దేశించి చెప్పాడు.