ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమంత కొత్త సినిమా రిలీజ్ డేట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 18, 2018, 03:30 PM



దక్షిణాదిన ఇప్పుడు సమంత ఉన్నంత ఊపులో మరే కథానాయికా లేదు. కొత్త ఏడాదిలో ఆమె మూడు బ్లాక్ బస్టర్లు ఖాతాలో వేసుకుంది. నెలన్నర వ్యవధిలో ‘రంగస్థలం’.. ‘మహానటి’.. ‘ఇరుంబు తిరై’ ఆమెకు తిరుగులేని విజయాల్ని కట్టబెట్టాయి. ఇందులో ‘మహానటి’.. ‘ఇరుంబు తిరై’ రెండు భాషల్లోనూ విజయవంతమయ్యాయి. సమంత సినిమాలో మరో మూడు విడుదలకు సిద్ధమవుతుండటం విశేషం. అవి మూడూ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకొస్తాయి. ముందుగా శివ కార్తికేయన్ సరసన సమంత నటించిన ‘సీమ రాజా’ విడుదల కాబోతోంది. ఈ రోజే ఆ చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించారు. వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 13న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారట.


గత మూణ్నాలుగేళ్లలో శివ కార్తికేయన్ హీరోగా ఇంతింతై అన్నట్లు ఎదిగాడు. అతడి చివరి సినిమా ‘వేలైక్కారన్’ సూపర్ హిట్టయింది. పొన్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీమ రాజా’ మీద కూడా తమిళంలో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేష్ మరో కథానాయికగా నటిస్తోంది. సమంత ఇందులో పూర్తి స్థాయి పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తోంది. లంగా వోణీలో ఆమె లుక్ ఇప్పటికే సూపర్ పాపులర్ అయింది. దీంతో పాటుగా తమిళంలో ‘సూపర్ డీలక్స్’ అనే ఓ థ్రిల్లర్ మూవీలోనూ నటిస్తోంది సమంత. అది అక్టోబర్లో రిలీజయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ‘యు టర్న్’ అనే ద్విభాషా చిత్రంలోనూ సమంత నటించింది. ఇది కన్నడలో విజయవంతమైన థ్రిల్లర్ మూవీకి రీమేక్. ఈ చిత్రంలో సమంత నిర్మాణ భాగస్వామి కూడా అది కూడా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మరి ఈ మూడు చిత్రాలతో సామ్ మరో హ్యాట్రిక్ కొట్టేస్తుందేమో చూద్దాం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com