తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకొంటున్న ఎన్టీఆర్ బయోపిక్ శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ సినిమాలో నటిస్తున్న సినీ తారల పేర్లు బయటకు రావడం ఆసక్తికరంగా మారుతున్నది. విద్యాబాలన్ ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో చేరగా.. అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ సినిమాలో చేరింది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ పోషించే పాత్ర మాత్రం సెన్సేషన్‌గా మారింది. అసలు రకుల్‌కు ఆ పాత్ర ఎలా దక్కిందంటే.. ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించడానికి సినీ నటులు విశేషమైన ఆసక్తిని చూపుతున్నారు. అదే కోవలో రకుల్ ప్రీత్ తన ఇంట్రెస్ట్‌ను చూపింది. తనకు ఇష్టమైన ప్రాజెక్ట్‌లో నటించేందుకు నందమూరి బాలకృష్ణను స్వయంగా రకుల్ సంప్రదించిందట. తనకు ఆ పాత్రలో నటించాలని ఉంది. ఒక సీన్ అయినా ఫర్వాలేదు అని తనే అడగడంతో బాలకృష్ణ ఒకే చెప్పారట.