ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరెక్స్ బ్యూటీకి ఛాన్సుల కష్టాలు

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 19, 2018, 01:00 PM



ఆరెక్స్ 100 సూపర్ సక్సెస్ తో దూసుకుపోతోంది. దర్శకుడి డిమాండ్ ఇప్పటికే పీక్స్ లో ఉండగా వస్తున్న కాల్స్ ని  బట్టి మామూలు నిర్మాతలకు అతను మూడు నాలుగేళ్ల దాకా దొరికేలా లేడు. హీరో కార్తికేయకు కూడా మంచి ఆఫర్స్ వస్తున్నప్పటికీ అన్ని భగ్న ప్రేమికుడి తరహాలో ఉన్నవి కావడంతో సెలెక్ట్ చేసుకునే విషయంలో తొందరపడటం లేదు. ఇక కథలో కీలకంగా మారి సినిమా ఇంతగా జనానికి రీచ్ కావడంలో ముఖ్య  పాత్ర మాత్రం పాయల్ రాజ్ పుత్ దే. నిజానికి ఇంత నెగటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్రను డెబ్యూ మూవీగా ఎవరూ ఒప్పుకోరు.


 కానీ పాయల్ ధైర్యం చేసింది. ఫలితం దక్కింది కానీ అది వేరే రూపంలో రావడం చూసి పాపం పాయల్ అంటున్నారు సన్నిహితులు. దానికి కారణం అన్ని ఇలాంటి వ్యాంపు తరహా పాత్రల ఆఫర్లు రావడమట. ఆరెక్స్ 100 కథలో పాయింట్ ను తీసుకుని అచ్చంగా అదే తరహాలో అనిపించే కథలతో తమ సినిమాలో చేయమని పాయల్ ను అడుగుతున్నారట. ఇంకో రెండు చేస్తే తనకు ఇమేజ్ పరంగా వేరే స్టాంప్ పడిపోతుందని గుర్తించిన పాయల్ వాటికి నో  చెబుతోందట. కనీసం ఏదైనా స్టార్ హీరో సినిమాలో క్యామియో కానీ లేదా ఐటెం సాంగ్ కానీ వస్తే మెల్లగా పెద్ద ప్రాజెక్ట్స్ అవే వస్తాయని ఎదురుచూస్తోంది  పాయల్. 


ఇక్కడేమో కానీ తన మాతృ బాష పంజాబీలో పాయల్ కు డిమాండ్ ఫుల్ గా ఉంది. గత ఏడాది విడుదలైన చెనా మేరియా మంచి పేరే తీసుకొచ్చింది. రేపు విడుదల కానున్న జాన్వీ కపూర్ దఢక్ కు పంజాబీ వెర్షన్ అది. హిందీలో వీర్ దే వెడ్డింగ్ లో చిన్న పాత్ర చేసిన పాయల్ తమిళ్ లో ఇరువర్ ఉల్లం అనే సినిమా చేసింది. అవేవి ఆరెక్స్ 100 అంత పేరు తీసుకురాలేదు. ఇందులో కూడా రెగ్యులర్ హీరోయిన్ పాత్ర అయ్యుంటే తన  కథ వేరుగా ఉండేది. కానీ పాయల్ వేసింది మామూలు పాత్ర కాదు. కామంతో రగిలిపోయే ఇందూ గానే  యూత్ తో పాటు ఇండస్ట్రీ కథకులు అదే దృష్టితో చూస్తున్నారు. అక్కడే వచ్చింది అసలు చిక్కు. మరి తాను కోరుకున్న బ్రేక్ ఎప్పుడు దక్కుతుందో వేచి చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com