ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గీతగోవిందం టీజర్‌కు ముహూర్తం ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 19, 2018, 02:29 PM



విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న సినిమా ‘గీత గోవిందం’. ప్రస్తుతం ఇది ప్రేక్షకులకు మోస్ట్ వాంటెడ్ మూవీ. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవలే విడుదలైన ఈ సినిమాలోని ‘ఇంకేం ఇంకేం కావాలే’ సాంగ్ కొద్ది రోజుల్లోనే కోటి వ్యూస్‌ని సొంతం చేసుకుని దూసుకుపోతోంది.ఈ సినిమా టీజర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్రబృందం. ఈ నెల 22న ఉదయం 11:22 గంటలకు టీజర్‌ను విడుదల చేయనుంది. పరుశురాం డైరెక్షన్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీకి బన్నీ వాస్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com