ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆక‌ట్టుకొంటున్న అమితాబ్‌..ఆరాధ్య‌ల పిక్‌

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 19, 2018, 04:28 PM



బాలీవుడ్ బిగ్ బి అమితాబ‌చ్చ‌న్  తన మనవరాలు ఆరాధ్యతో దిగిన ఓ ఫొటో అభిమానులను అలరిస్తోంది. ఆ ఫొటోను షేర్‌ చేసింది బిగ్ బీ కాదు. ఆయన కోడలు, బాలీవుడ్‌ భామ ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్‌ చేసింది. సాధారణంగా మనం ఐశ్వర్య, అభిషేక్‌, ఆరాధ్యల ఫొటోలను చూస్తూనే ఉంటాం. ఇలా ఒక్కసారిగా అమితాబ్‌తో కలిసి ఆరాధ్య కనపడుతుండడంతో ఈ తాత, మనవరాళ్ల ఫొటో వైరల్ అవుతోంది. ఈ  ఫొటోకి ‘లండన్‌ ప్రేమ’ అంటూ ఐశ్వర్య క్యాప్షన్‌ పెట్టింది. ఇందులో బిగ్‌ బీ చిరునవ్వులు చిందిస్తుండగా, ఆరాధ్య ఆయన భుజాలపై చేతులు వేసి కెమెరాకు పోజులిచ్చింది. వారి మధ్య బంధం చాలా దృఢమైందని ప్రశంసిస్తూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com