టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్న, ఫ్యామిలీకి మాత్రం ప్రాధాన్యత ఇస్తాడనే విషయం తెలిసిందే. కూతురితో ఎంతో సరదాగా ఉండే మహేష్ , సితారకి సంబంధించిన పలు విషయాలని అప్పుడప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకి చేరవేస్తుంటాడు. ఈ రోజు (జూలై 20) సితార ఆరవ బర్త్‌డే సందర్భంగా తన కూతురితో దిగిన ఫోటోని షేర్ చేస్తూ బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేశాడు. అంతేకాదు సితారతో కేక్ కూడా కట్ చేయించాడు. ఇక అభిమానులు సితార బర్త్‌డే సందర్భంగా హ్యష్ ట్యాగ్‌ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మరి కొందరు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. సితార అప్పుడప్పుడు మహేష్ మూవీ సెట్స్‌కి వెళ్లడం, అక్కడ టీంతో కలిసి సందడి చేయడం మనం చూసాం. పలు సందర్భాలలో సితార హమ్ చేస్తుండగా, ఆ వీడియోలని మహేష్ సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఎంతో చలాకీగా ఉండే ఈ చిన్నారికి సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కురుస్తుంది.