ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆది,తాప్సీల నీవెవ‌రో మూవీ నుంచి వెన్నెల వెన్నెల సాంగ్ ప్రొమో

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 20, 2018, 02:28 PM



ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కెతున్న మూవీ నీవెవరో. రచయిత కోన వెంకట్‌, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.. హ‌రినాధ్ ఈ మూవీ ద్వారా ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు.. ఈ మూవీలో ఆది అంధుడిగా క‌నిపించ‌నున్నాడు. ఇక ఈ మూవీ క‌న్న‌డ మూవీ అదే కంగ‌ల్ కు రీమేక్. ఒరిజినల్ వెర్షన్‌లో కలైయారసన్‌ హరికృష్ణనన్‌ కనిపించిన పాత్రలో ఆది నటించనున్నాడట. ఇదే కథతో తెలుగు, తమిళ భాషల్లో నీవెవరో సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ లోని వెన్నెల వెన్నెల సాంగ్ ప్రొమోను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.. ఈ సాంగ్ ను ఆది, తాప్సీల మ‌ధ్య చిత్రీక‌రించారు.. శ్రిజో సాహిత్యం అందించిన ఈ సాంగ్ ను సిద్ శ్రీ‌రామ్ ఆల‌పించాడు.. ప్ర‌సేన్ సంగీతం స‌మ‌కూర్చాడు.. మీరూ ఈ సాంగ్ ను చూడండి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com