ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గూఢచారి మూవీలో మధు శాలిని లుక్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 20, 2018, 04:51 PM



అడవి శేష్, శోభిత దూలిపాళ్ల జంటగా నటిస్తున్న మూవీ గూఢచారి.. ఇటీవలే సుప్రియా యార్లగడ్డ పోషిస్తున్న నదియా ఖురేషీ పాత్ర లుక్ ను ఇవాళ విడుదల చేశారు. రా ఏజెన్సీకి కి చెందిన త్రినేత్ర అనే సీక్రెట్ ఏజెన్సీకి వర్క్ చేసే సీక్రెట్ ఏజెంట్ గా నటిస్తున్నది.. తాజాగా మరో స్పై పాత్రలో నటిస్తున్న మధుశాలిని పాత్రను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ పోస్టర్ ను విడుదల చేసింది..లీనా రాజన్ పాత్రలో ఆమె అతిథి పాత్రలో కనిపించనుంది.. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. శశికిరన్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పై థ్రిల్లర్ ను అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com