మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తన భార్యను విష్ చేస్తూ రామ్ చరణ్ తన సోషల్ మీడియా పేజీలో ఓ పోస్టు పెట్టారు. దీని ద్వారా భార్యపై తన ప్రేమను, ఆమె తన పక్కన ఉంటే ఎంత సంతోషంగా ఉంటానో చెప్పే ప్రయత్నం చేశారు. రామ్ చరణ్ అభిమానులు సైతం ఉపాసనను విష్ చేస్తూ కామెంట్లతో ముంచెత్తారు. అంతే కాదు... ఇదే రోజు మహేష్ బాబు కూతురు సితార పుట్టినరోజు కూడా. ఈ సందర్భంగా మెగా చైల్డ్ హెల్త్ క్యాంప్ నిర్వహించారు.
నువ్వు దయాగుణం గల వ్యక్తివి... నువ్వు అమేజింగ్, ఫెంటాస్టిక్, బ్యూటిఫుల్. నా పక్కన ఉంటే మరింత సంతోషంగా ఉంటాను. హ్యపీ బర్త్ డే మై లవ్ అంటూ రామ్ చరణ్ విష్ చేశారు.మహేష్ బాబు కూతురు సితారకు కూడా రామ్ చరణ్ చరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఉప్సి, సితార బర్త్ డే ఒకే రోజు రావడం ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే నిన్ను కలుస్తాను నువ్వు నా కోసం పాట పాడాలన్నారు.తన కూతురు 6వ పుట్టినరోజు జరుపుకుంటుందని, తను ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు మహేష్ బాబు ట్వీట్ చేశారు.సితార పుట్టినరోజు సందర్భంగా మెగా చైల్డ్ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ విషయాన్ని నమ్రత ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.