ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంచు మనోజ్ 'ఒక్కడు మిగిలాడు' ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 19, 2017, 01:29 PM



భారతదేశంలో ఇంకా స్వాతంత్ర్య పోరాటం కొనసాగుతూ ఉంటే అల్లూరి, భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లను మీరు ఏమని పిలుచుకునేవారు? తీవ్రవాదులనా..? లేక దేశభక్తులనా..? డైలాగ్ ఎలా ఉంది? ఈ డైలాగ్‌తో మొదలై దేశం వర్ధిల్లాలి అంటూ ముగుస్తుంది ట్రైలర్. ఇంతకీ ఏం ట్రైలర్ అంటారా? ఇది మంచు మనోజ్ నటించిన ఒక్కడు మిగిలాడు మూవీ ట్రైలర్.


ఇప్పటి వరకూ దాదాపు కామెడి సినిమాలకే పరిమితమైన మనోజ్ ఒక్కసారిగా యాక్షన్ మూవీలో నటిస్తున్నాడు. నటించడమే కాదు అదరగొట్టాడు. 1:39నిమిషాల ఒక్కడు మిగిలాడు ట్రైలర్‌ను.. యాన్ అన్ టోల్డ్ ట్రూ స్టోరీ క్యాప్షన్‌తో శనివారం మనోజ్ తన ట్విట్టర్ అకౌంట్‌ ద్వారా రిలీజ్ చేశాడు. ఫస్ట్ టైమ్ సీరియస్ డైలాగ్స్, సీరియస్ యాక్షన్‌తో ఓ కొత్త లుక్‌లో మనోజ్ ఆకట్టుకున్నాడు. ఎస్.ఎన్.రెడ్డి నిర్మాణ సారధ్యంలో.. అజయ్ ఆండ్రూస్ నూతక్కి డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com