కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ మధ్య సినిమాలతో పాటు ప్రేమాయణంతోను ఎక్కువగా వార్తలలో నిలుస్తూ వస్తుంది. తెలుగులో సైరా అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో చిరు సరసన కథానాయికగా నటిస్తుంది. తమిళంలో ఇమ్మైక్క నోడిగల్, కొలమావు కొకిల అనే సినిమాలు చేయగా, ఇవి రెండు చిత్రాలు ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన కోకో( కోలమావు కోకిల) చిత్రం బ్లాక్ కామెడీ కథా చిత్రంగా రూపొందింది. ఇందులో నటుడు యోగిబాబు ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 24న విడుదల కానుంది. ఇక నయనతార మరో చిత్రం ఇమైకా నోడిగళ్ ఆగస్ట్ 10న విడుదల కానుంది.
డిమాంటీ కాలనీ వంటి సంచలన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఈ మూవీని తెరకెక్కించాడు. యంగ్ హీరో అధర్వ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంతో టాలీవుడ్ భామ రాఖీఖన్నా కోలీవుడ్ కి పరిచయం కానుంది. రెండు వారాల గ్యాప్‌లో నయనతారకి సంబంధించిన రెండు సినిమాలు విడుదల కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కోలీవుడ్‌లో ఓ కథానాయిక రెండు సినిమాలు ఒకే నెలలో విడుదల కావడం ఇదే తొలిసారి.