కొత్త నటీనటులతో తీసిన ఓ సినిమా బాక్సాఫీసు వద్ద ఇంత చక్కటి వసూళ్లతో ప్రారంభం కావడం చాలా అరుదని సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ తెలిపారు. ఈ వసూళ్లు సూపర్ హిట్ చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ వసూళ్ల కంటే (తొలిరోజున దేశవ్యాప్తంగా రూ.8 కోట్లు వసూలు చేసింది) ఎక్కువని చెప్పారు. ‘ధడక్’ చిత్రం ఓపెనింగ్ రోజున దేశవ్యాప్తంగా రూ.8.71 కోట్లు సాధించినట్లు ట్వీట్ చేశారు. ‘ధడక్’ సినిమాలో ఇషాన్ ఖట్టర్ ..జాన్వీ కపూర్ నటించారు. శశాంక్ ఖైతాన్ దర్శకుడు. కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించారు. అజయ్-అతుల్ బాణీలు అందించారు. మరాఠీ బ్లాక్బస్టర్ ‘సైరాత్’కు హిందీ రీమేక్ ఇది. వేర్వేరు కులాలకు చెందిన అబ్బాయి, అమ్మాయికి మధ్య చిగురించిన ప్రేమకథతో సినిమాను రూపొందించారు.