ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీదేవి కూతురు పిచ్చెక్కిస్తోందిగా

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 19, 2017, 04:17 PM



ఇంకా సినిమా ఎంట్రీ జరగనే లేదు. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ లేదు. కాని అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాహ్నవి మాత్రం అప్పుడే హీరొయిన్ రేంజ్ బిల్డప్ ఇచ్చేస్తోంది. స్టార్ హీరొయిన్ కూతురు కాబట్టి మొహమాటపడాల్సిన అవసరం లేదని తన లైఫ్ స్టైల్ ద్వారా చెప్పకనే చెబుతోంది. తాజాగా ఫ్యాషన్ డిజైనర్ మనిష్ మల్హోత్రా అరేంజ్ చేసిన ఒక పార్టీలో బ్యాక్ లెస్ టాప్ తో వచ్చి అందరు మతులు పోగొట్టేసింది జాహ్నవి. ఈ మధ్య తనని సోషల్ లైఫ్ లోకి బాగా తీసుకొస్తోంది శ్రీదేవి.


అమ్మ అంత కళ్ళు చెదిరే అందం జాహ్నవిలో లేదు కాని ముందు ముందు మేజిక్ చేసే అవుట్ ఫిట్ అయితే తనలో కనిపిస్తోంది. తన తెరంగేట్రం గురించి తండ్రి బోనీ కపూర్ వైపు నుంచి వ్యతిరేకత రాకపోవడం, చిన్నాన్న అనిల్ కపూర్ కూతురు తనకు అక్కయ్య వరస సోనం కపూర్ రెచ్చిపోయి అందాలు ఆరబెడుతున్నా కుటుంబంలో ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం లాంటి కారణాలు జాహ్నవి కాన్ఫిడెన్స్ ని పెంచుతున్నాయి.


 


జాహ్నవి తెరంగేట్రం కరణ్ జోహార్ నిర్మించే స్టూడెంట్ అఫ్ ది ఇయర్ సీక్వెల్ తో జరిగే అవకాశాలు ఉన్నాయి. తెలుగులో కూడా తనకు ఆఫర్స్ వస్తున్నప్పటికీ శ్రీదేవి ప్రిఫరెన్స్ మాత్రం హింది సినిమాల వైపే ఉంది. అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ కూతుళ్ళు కూడా తెరంగేట్రం చేయబోతున్నా జాహ్నవి  అంత అటెన్షన్ వాళ్ళ మీద లేదు.


సో జాహ్నవి నుంచి కూడా ఆకు చాటు పిందె తడిసే టైపు అందాల ఆరబోత చూడవచ్చు అని అర్థమైంది. శ్రీదేవి చాలా ఆశలు పెట్టుకుని చేసిన మామ్ ఆశించిన  ఫలితం ఇవ్వలేదు. తన ఫ్యూచర్ కంటే జాహ్నవి కెరీర్ బిల్డింగ్ మీద ఇకపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని డిసైడ్ అయ్యిందట  శ్రీదేవి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com