బాలీవుడ్ సిస్టర్స్ కరీనా కపూర్, కరిష్మా కపూర్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం నెట్ లో ఈ అక్కా చెల్లెళ్ళ స్టన్నింగ్ యాక్ట్ ఒకటి వైరల్ గా మారింది. గ్లామ్ సిస్టర్స్ షికారుకి వెళ్ళే ముందు ఒకే స్టైల్ డ్రెస్ ధరించి ఆ యాక్ట్ చేశారు. వైట్ టీషర్ట్, బ్లాక్ ప్యాంట్, గోల్డ్ స్టార్స్ తో ఉన్న గ్రీన్ జాకెట్ ధరించిన వీరు సేమ్ స్టైల్ తో వీడియో ని తయారు చేశారు. ఇది తమ ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేయగానే వేల కొలది లైక్స్ తో పాటు వందల కొలది షేర్లు జరిగాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్ లో వైరల్ గా మారింది. బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ రీసెంట్ గా పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తన కొడుకు కు తైమూర్ అనే పేరు కూడా పెట్టారు. ప్రస్తుతానికి మాతృత్వాన్ని అనుభవిస్తున్న కరీనా.. రీసెంట్ గా ఓ బుక్ రాయడం ప్రారంభించిందట. తల్లిగా, గర్భవతిగా ఉన్నప్పుడు తను ఎదుర్కొన్న సమస్యలను, తన అనుభవాలను ఈ పుస్తకం ద్వారా కరీనా వెలుగులోకి తీసుకురానుందట. ఈ పుస్తకం పూర్తిగా తన మాతృత్వం మీదే ఉంటుందని... అంతేకాకుండా, ఆసక్తి, ఫన్ ను కూడా ఈ పుస్తకంలో జోడించినట్లు ఇటీవల చెప్పుకొచ్చింది కరీనా.