ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రియా వారికి గట్టిపోటీని ఇచ్చింది

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 21, 2017, 01:59 PM



సినిమా పరిశ్రమలలో కథానాయకుల్లా హీరోయిన్స్ ఎక్కువ కాలం ఎదగలేరు అంటుంటారు. ఎందుకంటే మూడు పదుల వయసు దాటగానే అందంలో కాస్త వెనెకబడిపోతారు అని టాక్. కానీ కొందరు హీరోయిన్స్ మాత్రం 30 కాదు 40 దాటినా ఇంకా ఆకట్టుకుంటూనే ఉంటారు. ప్రస్తుతం శ్రీయ కూడా తన అందంతో తెగ ఆకట్టుకుంటోంది. 35 ఏళ్ల వయసు దగ్గరపడుతున్నా ఇంకా తన ఘాటు అందాలను ప్రదర్శిస్తూనే ఉంది. అయితే రీసెంట్ గా జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ లో ఈ అమ్మడు ఇచ్చిన క్లివేజ్ షోకి ఎంతటివారైనా ఫిదా అవ్వాల్సిందే.


ఆ ఫ్యాషన్ షోలో ఆమెకు పోటీగా వచ్చిన వెరీ యంగ్ హీరోయిన్స్ దిశా పటాని- నర్గిస్ ఫక్రి ల కంటే తన అందాలనే అందరు చూసేలా తెగ ఆకట్టుకుంది. ఓ విధంగా చెప్పాలంటే శ్రియా వారికి గట్టిపోటీని ఇచ్చింది అని చెప్పాలి. దాదాపు సినిమా ఫీల్డ్ లోకి వచ్చి పద్దెనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటికి ఇంకా 16 అన్నట్టు తన ఘాటైన సోయగాలతో శ్రియా మతి పోగొడుతోంది. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం అంతగా ఆఫర్స్ రాకున్నా వచ్చిన సినిమాలనే చక్కగా చేసుకుంటూ.. మరో ఐదేళ్లు కెరీర్ ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది మొదట్లో బాలయ్య తో "గౌతమి పుత్ర శాతకర్ణి" సినిమాతో మంచి హిట్ అందుకొని పరవాలేదు అనిపించింది. ఇప్పుడు మళ్లీ మరో సారి బాలయ్యతో జోడి కట్టి "పైసా వసూల్" సినిమాతో అయినా భారీ హిట్ కొట్టాలనుకుంటోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఈ అమ్మడు ఈ సినిమాపై భారీ ఆశలే పట్టుకుంది. అలాగే ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో నానా పటేకర్ ప్రధాన పాత్రధారుడిగా తెరకెక్కనున్న రొమాంటిక్ కామెడి ఎంటర్టైనర్ లో హీరోయిన్  నటిస్తోంది శ్రీయ. మరి ఈ రెండు సినిమాలతో అయినా అమ్మడు మళ్లీ ఫామ్ లోకి వస్తుందో లేదో చూడాలి.   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com