ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మకుటం లేని ఇంద్రుడు మన మెగా స్టార్‌

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 21, 2017, 06:36 PM



’మెగాస్టార్‌ చిరంజీవి’ ఇది జస్ట్‌ పేరు కాదు.. సినీ రంగం లో ఓ ప్రభంజనం. ఎందరో నటీ నటులకు ఊరిపిరి పోసిన ఇస్పిరేషన్‌ పర్సనాలిటీ, వందలు కాదు వేలు కాదు లక్షల  ప్రశంశలు అందుకున్న స్టార్‌, దాదాపు 45  ఏళ్ళ  సినీ చరిత్రలో  తన గురుంచి ఎంత చెప్పినా ఎంత విన్నా  తక్కువే.. ఒక  వైపు నటన, మరో వైపు మెగా సేవా కార్యక్రమాలు, ఇంకో వైపు  రాజకీయం  ఇలా ఏకోణం లో చూసినా జగదేకవీరుడిగా పేరుగడించాడు మన మెగా స్టార్‌.  ఇదంతా  తెలియని, వినని ప్రేక్షకుడు ఉండడేమో.. ఇక అసలు విషయానికి వస్తే చిరు చాలా గ్యాప్‌ తీసుకున్న తరువాత తమిళ రీమేక్‌ తో  ఖైదీ నెంబర్‌ 150  చిత్రం చేసి కాసుల సునామి సౄఎష్టించిందనే విషయం అందరికీ తెలిసినదే అయితే ఈ  మెగాస్టార్‌ కు నేటితో 62 సంవత్సరాలు నిండి 63  వసంతాలు రానున్నాయి.   ఈ సందర్బంగా ఈయన మెగా అభిమానులకు ఓ కానుక ఇవ్వనున్నారు ఏంటంటే... చిరు తన కెరీర్‌ లో ఇంతవరకు పూర్తి స్థాయి  చారిత్రాత్మక చిత్రం చేయలేదు.


1983 సంవత్సరం లో వచ్చిన  ’శివుడు శివుడు శివుడు’  అనే సినిమాలోని పాత్ర  కొంత వరకు కనిపించినా ఆ తరువాత చాలా మటుకు కమర్షియల్‌ ఎలెమెంట్స్‌ ఉన్న పాత్రల్లోనే కనిపించారు. అయితే ఇప్పుడు ఇంత కాలానికి   సరికొత్తగా 151 చిత్రంగా కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై ఈయన తనయుడు  రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న ’ఉయ్యాల వాడ నరసింహ రావు’  అనే జీవిత  చారిత్రాత్మక చిత్రం లో నటిస్తున్నారని, ఈ చిత్ర పూజా కార్యక్రమాలు మొన్నీమధ్య  జరుపుకున్నారని కూడా మనకు తెలిసిందే...  సురేందర్‌ రెడ్డి  దర్శకత్వం  లో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ ను  చిరంజీవి పుట్టిన రోజు కానుకగా విడుదల చేశారు.  ఈ సినిమా ను  అంతర్జాతీయ గుర్తింపు  సినిమా గా తీర్చి దిద్ధేందుకు సన్నాహాలు చేస్తునట్టు సమాచారం. మరో వైపు ఈ సినిమాకు  జక్కన్న రాజమౌళి హ్యాండ్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం అతి త్వరలో ఈ చిత్ర  షూటింగ్‌ మొదలు కానుంది. బ్రేకులు లేకుండా సినిమా పూర్తి చేయడానికి చరణ్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు వినపడుతోంది. ముగ్గురు హీరోయిన్‌ లు మెగా స్టార్‌ ప్రక్కన  నటిస్తున్నట్లు కూడా చెర్రీ తెలిపారు.  మొత్తానికి మెగా అభిమానులకు తమ అభిమాన హీరో కొత్త తరహా పాత్రలో  కనిపించి కనువిందు చేయనున్నాడని తెగ సంబర పడుతున్నారు అంతా..


 ప్రస్తుత సినీ రంగం లో  చారిత్రాత్మక చిత్రాల హవా నడుస్తున్నట్లు తెలుస్తోంది.      బాహుబలి, బాలీవుడ్‌  బాజీరావు మస్తానీ , బాలకౄఎష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి... ఇలా ఈ తరహా చిత్రాల హవా వీస్తోంది.  కనుక ఈ చిత్రాలే  మన మెగా స్టార్‌ కు ఇన్స్పిరేషన్‌ గా భావించి  ఇంత కాలానికి వెరైటీ లుక్‌ లో కనిపిస్తున్నారు కాబోలు. ఏది ఏమైనా మన మెగా స్టార్‌ సినీ చరిత్రకు  తిరుగులేని ఇంద్రుడే..  నేడు ఈయన పుట్టిన రోజు కావడం తో సూర్య దిన పత్రిక తరుపున మెగా స్టార్‌ చిరంజీవి గారికి  జన్మదిన  శుభాకాంక్షలు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com