ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దీపికా వద్దూ.... అంటున్నా వినడం లేదట

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 21, 2017, 06:38 PM



గ్లామర్‌ ఫీల్డ్‌ లో కొందరు   ప్రేమించుకున్నారంటే ఆజంట ఇక ఏమాత్రం ఆగకుండా చెట్టాపట్టాలేసేసుకొని తెగ తిరగడమే కాకుండా వాళ్ళ సీక్రెట్‌ ఫొటోస్‌ కూడా లీక్‌ చేసేస్తూ హలచల్‌ చేస్తుంటారు.. వాటి వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదు కానీ ఓ ప్రేమ జంట ఇలా తిరగడం నచ్చలేదని ఓ దర్శకుడు చిన్నబుచ్చుకున్నాడట.. వివరాల్లోకెళితే బాలీవుడ్‌ స్టార్స్‌  దీపిక పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ ప్రేమించుకున్నట్లు కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. వీరిద్దరూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా వారు చేసే పనులు చూస్తే ఎవ్వరైనా ఇద్దరినీ ప్రేమికులనే అనుకుంటారు. అందుకు ఉదాహరణ రణ్‌వీర్‌ తన పుట్టినరోజు నాడు కొత్తకారులో దీపికను బయటికి తీసుకెళ్లడమే.


అదీకాకుండా ఇటీవల రణ్‌వీర్‌, దీపిక ముద్దాడుతున్న ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో వెరల్‌ అయింది. అయితే వీరిద్దరూ ఇలా కలిసి తిరగడంతో బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.   ఎందుకంటే భన్సాలీ దర్శకత్వం లో రణ్‌వీర్‌, దీపిక, షాహిద్‌ కపూర్‌ ప్రధాన   పాత్రల్లో నటిస్తున్న చిత్రం పద్మావతి. 


ఈ చిత్రంలో రణ్‌వీర్‌, దీపిక మధ్య ఎలాంటి సంభాషణలు, సన్నివేశాలు ఉండవు. దాంతో రణ్‌వీర్‌, దీపిక అభిమానులు ఇప్పటికే దీనిపై ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారట. ఇద్దరినీ తెరపై కలిసుండడం చూడాలనుకుంటున్నామని అంటున్నారట. మరోవెపు సినిమా చిత్రీకరణ పూర్తయ్యేంతవరకు ఇద్దరూ కలిసి తిరగకూడదని భన్సాలీ దీపికకు  ఆంక్షలు విధించారని కూడా తెలిసింది.  అయినా ఆయన మాటలు పట్టించుకోకుండా రణ్‌వీర్‌, దీపిక తరచూ కలుసుకుంటూ ఉండడంతో భన్సాలీ వారిపై అలిగారట.  మిగతా సందర్భాల్లో వారిద్దరూ ఎలా ఉన్నా తనకు అభ్యంతరం లేదని కనీసం చిత్రీకరణ పూర్తయ్యేవరకైనా తాను చెప్పినట్లు నడుచుకుంటే బాగుంటుందని భన్సాలీ తెలిపారు. ఈ   పద్మావతి చిత్రం డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com