ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అను ఎమ్మానుయేల్ కొత్త ఫోటో షూట్లో చూడండి

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 22, 2017, 12:51 PM



కొంతమంది హీరోయిన్లు వచ్చీ రావడంతోనే హోమ్లీ లుక్ ఉన్న పాత్రలను చేస్తారు. కాని వారికి అలాంటి పాత్రలను చేస్తూ అదే మూసలో కొనసాగాలని ఉండదు. అదిగో మొన్ననే లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ బికినీ వేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాను.. కాని ఎవ్వరూ అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పింది. ఇప్పుడు మరో భామ అను ఎమ్మానుయేల్ కూడా అదే తరహాలో చెబుతుందేమో అనిపిస్తోంది. 


అమెరికా నుండి వచ్చిన మలయాళీ భామ అను.. తెలుగులో మజ్నూ సినిమాతో తెరంగేట్రం చేసింది. వచ్చీరావడంతోనే హోమ్లీగా కనిపించింది. కాని ఆమెకు అసలు అలాంటి పాత్రలు ఇష్టమేనా? నిత్యా మీనన్ తరహాలో కొనసాగుతుందా? ఇలాంటి ప్రశ్నలను అడిగితే మాత్రం.. ఆమె ఖచ్చితంగా నో అనే చెబుతున్నట్లు ఉంది. అదిగో ఇక్కడో కొత్త ఫోటో షూట్లో చూడండి.. ఆమె సొగసులన్నీ తెలిసేలా.. ఇన్నర్ వేర్ లోనే ఫోజులు ఇస్తోంది. అను అను అని మనం అంటుంటే.. హాటను హాటను అంటూ ఆమె చెబుతోంది. అందుకే ఈమె త్వరలోనే ఒక పెద్ద గ్లామర్ స్టార్ అయిపోతుందేమో అనిపిస్తోంది. 


ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్న అను.. ఆ తరువాత అల్లు అర్జున్ సరసన ''నా పేరు సూర్య'' సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ రెండు సినిమాల్లో ఒక్కటి హిట్టయినా కూడా ఆమె ఫేట్ మారిపోయినట్లే. కాకపోతే త్వరగా ఫేడవుట్ అయిపోకుండా ఉండడానికి అను తెలుసుకోవాల్సిన టిప్ ఏంటంటే.. ఆమె త్వరగా సన్నబడాలి. రోజురోజుకూ వెయిట్ పెంచితే కష్టం.. మనోళ్ళు వెయిటింగులో పెట్టేస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com