ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైరా... నాకు సవాల్‌లాంటిది : చిరంజీవి

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 23, 2017, 12:35 PM



ఎప్పటి నుంచో స్వాతంత్య్ర సమరయోధుల పాత్రలో... ముఖ్యంగా భగత్‌సింగ్‌ పాత్రలో నటించాలనుకుంటున్నా. ఇన్నాళ్లకు తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి  జీవితకథలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఈ పాత్ర నాకు సవాల్‌ లాంటిది’’ అని చిరంజీవి అన్నారు. ఆయన పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్‌లో మంగళవారం ఫ్యాన్స్‌ సమక్షంలో జరిపారు. ఈ సందర్భంగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తండ్రి చిరంజీవి హీరోగా తనయుడు రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ మోషన్‌ పోస్టర్‌ను దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, ఫస్ట్‌ లుక్‌ 


పోస్టర్‌ను నిర్మాత అల్లు అరవింద్‌ విడుదల చేశారు. ఈ వేడుకకు చిరంజీవి రాకపోయినా, తన మనసులోని మాటలను వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు చిరంజీవి మాట్లాడుతూ – ‘‘సైరా నరసింహారెడ్డి’ కోసం సురేందర్‌రెడ్డి చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కనున్న ఈ చిత్రం అద్భుత దృశ్యకావ్యంలా ఉంటుంది. నాపై ఇంత ప్రేమ చూపిస్తున్న మీలాంటి  అభిమానుల కోసం నేనేం చేయగలను? మీరు గర్వపడే సినిమాలు చేయడం తప్ప. ‘సైరా నరసింహారెడ్డి’ మీరందరూ గర్వపడే సినిమా అవుతుంది’’ అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com