ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కౌశల్.. జనం నీ ముఖం మీద తూ.. అని ఊస్తారు: సునయన

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 15, 2018, 12:07 PM



బిగ్ బాస్ సీజన్ 2లో పదోవారం వచ్చేసరికి కంటెస్టెంట్స్‌లో ఎలిమినేషన్ టెన్షన్ మొదలైంది. ఇప్పటికే 65 ఎపిసోడ్‌లు పూర్తి కావడంతో బిగ్ బాస్ టైటిల్ రేస్‌లో నిలిచి ఫైనల్ పోరులో గెలిచేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక మంగళవారం నాడు జరిగిన 66వ ఎపిసోడ్‌లో ఆసక్తికరమైన అంశాలు చాలానే ఉన్నాయి. 


ఇక ఈ వారం ఎలిమినేషన్‌లో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకోవడంతో తాము ఎందుకు ఇలా ఎలిమినేషన్‌లోకి వచ్చాము. దానికి కారణం ఎవరు? అన్న దానిపై సభ్యుల మధ్య చర్చ జరిగింది. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్‌‌కి రీ ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు, శ్యామలలు ఎలిమినేషన్ జోన్‌లో ఉండటంతో తదుపరి కార్యాచరణను కసరత్తులు మొదలు పెట్టారు. 


 


కెప్టెన్‌గా తనీస్ వేస్ట్.. 


బిగ్ బాస్ హౌస్‌ నుండి గతంలో నేను ఎలిమినేట్ కావడానికి తనీష్ కారణం. మళ్ళీ నన్ను ఎలిమినేషన్‌కి నామినేట్ చేయడం బాధకలిగించిందన్నారు యాంకర్ శ్యామల. అయితే తనని ఎలిమినేట్ చేయడానికి తనీష్ చెప్పిన కారణం తనకు నచ్చలేదన్నారు. అతడికి హౌస్‌లో ఒక ఫ్రెండ్‌లా సక్సెస్ అయ్యి ఉంటాడేమో కాని కెప్టెన్‌గా విఫలం అయ్యాడన్నారు శ్యామల.


 


బిగ్ బాస్ కాల్ సెంటర్ టాస్క్.. 


ఈవారం లగ్జరీ టాస్క్ బడ్జెట్‌లో భాగంగా కాల్ సెంటర్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ ప్రకారం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ రెండు టీంలుగా ఉన్నారు. వారిలో ఒకటి కాల్ సెంటర్ ఉద్యోగులు కాగా.. మరొకరు పబ్లిక్ కాలర్స్. ఈ టాస్క్‌లో కౌశల్, దీప్తి, సామ్రాట్, శ్యామల, అమిత్, నూతన్ నాయుడు కాల్ సెంటర్ ఉద్యోగులుగా ఉండగా.. మిగిలిన తనీష్, సునయన, గీతా మాధురి, పూజా, గణేష్, రోల్ రైడాలు పబ్లిక్ కాలర్స్‌గా ఉన్నారు. 


 


 


ఏం పీకుతున్నావ్ కౌశల్.. జనం నీపై తూ అని ఊస్తారన్న సునయన 


అనంతరం కౌశల్‌‌తో స్టార్టింగ్‌లోనే ఎటాక్‌కి దిగింది సునయన. అసలు ఏంటి నీ బాధ. బిగ్ బాస్ హౌస్‌లో ఏం చేయాలనుకుంటున్నావ్.. జనాలు నిన్ను ఎలా చూస్తున్నారో ఏమో కాని.. అసలు నీకు ఓట్లు ఎలా వస్తున్నాయో అర్ధం కావడం లేదు. నీ నటన గురించి వాళ్లకు తెలియక పోవడం వల్ల నువ్ తెగ ఫీల్ అయిపోతున్నావ్. నిజం చెప్పాలంటే నీకసలు బిగ్ బాస్ హౌస్‌లో ఉండే అర్హతే లేదు. బిగ్ బాస్ హౌస్‌లో నీ ప్రవర్తను ఎలా ఉందో 24 గంటలు జనం చూస్తే.. నీ ముఖం మీద తూ... అని ఊస్తారు. నువ్ పెద్ద హీరోలా ఫీల్ అయిపోకు. నీకు తెలియడం లేదేమో నువ్ హీరోవి కాదు జోకర్‌వి అవుతున్నావ్. 


 


నేను సంచాలకురాలుగా ఉన్నప్పుడు నాకు నీ సలహాలు ఏంటి? జడ్జ్‌మెంట్‌లో నీ బోడి సలహాలు ఏంటి? అది నా ఇష్టం. తనీష్‌తో నేను ఉంటే నీ ఏంటి? అతనిపై నీ గజ్జి ఏంటి? పూజా నిన్ను సపోర్ట్ చేస్తే.. ఆమె కెప్టెన్సీపై నువ్వు నిందలు వేస్తావా? నువ్ ఏకాకిగా ఉన్నా అంటూ ఏడుస్తున్నావ్. నీ ప్రవర్తన వల్లే నిన్ను అలా చేస్తున్నాం అంటూ కౌశల్ సహనానికి పరీక్ష పెట్టింది సునయన. 


 


ఇక కౌశల్‌ని పాట పాడు, లవ్ సాంగ్ పాడు, స్టోరీ చెప్పు అనడంతో సునయన గతంలో నడిపిన ప్రేమకథల్ని, అందులో ఉన్న వ్యక్తులు పేర్లు వచ్చేలా పదే పదే జస్వంత్, షణ్ముక్ పేర్లతో కథలు అన్ని సునయన విసిగించాడు కౌశల్. ఇక లవ్ సాంగ్ పాడమంటే.. బిగ్ బాస్ హౌస్‌కి ప్రేమలో పడితే చెల్లమ్మా.. పడుకుంటే చెల్లెమ్మా.. జనం బయటకు తోసేస్తారు చెల్లెమ్మా అంటూ సునయనకు కౌంటర్‌లు వేశాడు కౌశల్. 


 


ఇక బిగ్ బాస్ హౌస్‌ గురించి చెప్పు అంటే.. హౌస్‌లో రన్నింగ్ టాస్క్ ఇస్తే అందులో పాల్గొన్న అమ్మాయి లిఫ్టిక్ సరిచేసుకుంటూ వెనుకున ఉండిపోతే.. ఇంకొక వ్యక్తి ఆమెను రన్నింగ్‌లో గెలిపించడం కోసం త్యాగం చేశారు అంటూ తనీష్, సునయన రన్నింగ్ స్టోరీని చెప్పుకొచ్చాడు. ఇక కౌశల్ చెప్పిన స్టోరీకి కన్నీళ్లు పెట్టుకుంది సునయన. దీంతో హౌస్ బయట ఉన్న తనీష్ కోపంతో ఊగిపోయాడు. పర్సనల్ విషయానికి వస్తే.. నువ్ కూడా పర్సనల్‌గా మాట్లాడు. తరువాత నేను చూసుకుంటా అంటూ కౌశల్ వైపు కోపంతో చూస్తూ ఊగిపోయాడు. ఇవ వీరి మధ్య ఫోన్ సంభాషణ కొనసాగుతూనే ఉండగా.. నేటి ఎపిసోడ్ ముగిసింది. ఇక రేపటి ఎపిసోడ్‌లో గణేష్ కూడా కౌశల్‌నే టార్గెట్ చేస్తూ.. విసిగించే ప్రయత్నం చేస్తున్నాడు.. మరి మన ఎలిమినేషన్ స్టార్ గణేష్ పెర్ఫామెన్స్ ఎలా ఉంది? ఈ ఫోన్ సంభాషణలలో ఎవరిది పైచేయి అవుతుందో రేపటి ఎపిసోడ్‌లో తేలనుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com