ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెక్స్ వర్కర్ పాత్రలో ‘గూఢచారి’ హీరోయిన్

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 17, 2018, 04:58 PM



గూఢచారి సినిమా హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల సెక్స్ వర్కర్ పాత్రలో అలరించనుందని సమాచారం. అడవి శేష్ హీరోగా ఇటీవలే విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ టాక్‌ను సంపాదించుకోవడమే కాకుండా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శోభితకు కూడా మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఈ అమ్మడికి వ‌ర‌స ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.


 గతంలో తనకు బోల్డ్ క్యారెక్టర్స్‌లో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటూ అమ్మడు చెప్పకనే చెప్పేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మాజీ మిస్ ఇండియా ఓ ఛాలెంజింగ్ రోల్‌లో నటిస్తోందని సమాచారం. మలయాళంలో తెరకెక్కుతున్న ముతోన్ అనే సినిమాలో ఈ ముద్దుగుమ్మ వేశ్య పాత్రలో కనిపించనుంది తెలుస్తోంది. కానీ కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి పాత్రను స్వీకరించి శోభిత పెద్ద సాహసం చేస్తుందనే చెప్పాలి. మరి ఈ అమ్మడికి ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఇస్తుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com