అందాల దేవత ఐశ్వర్యారాయ్‌తో నటించను అనేవాళ్ళు ఎవరూ ఉండరు అన్న భావన చాలా మందిలో ఉంది. కానీ ఓ యువనటుడు మాత్రం ఐష్‌తో నటించను అని ఏకంగా సినిమా నుంచే తప్పుకున్నాడట! వివేక్ ఒబ్రాయ్ తమ్ముడు అక్షయ్ ఒబ్రాయ్ పక్కన ఐష్‌ని అనుకున్నారట! ఐష్ కూడా ఓకే చెప్పిందట! కానీ అక్షయ్ మాత్రం తన పక్కన నటించను అంటూ ఆ సినిమానుంచి తప్పుకున్నాడట! దీనికి కారణం అక్షయ్ అన్నయ్య వివేక్ ఒబ్రాయ్ కారణం అయి ఉండవచ్చని బాలీవుడ్ జనాలు అంటున్నారు. ఒ...కప్పుడు ఐష్, వివేక్ గాఢంగా ప్రేమించుకుని ఆ తరువాత విడిపోయారు. ఈ కారణంగానే అక్షయ్ ఐష్‌తో నటించడానికి ఇష్టపడి ఉండకపోవచ్చని అంటున్నారు.