బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలతో తెలుగులో సక్సెస్ హీరోగా మారిపోయాడు సిద్దార్ధ్. ‘ఆట’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సినిమాలు పరవాలేదనిపించినా ఆ తర్వాత వచ్చిన ‘జబర్దస్త్’, ‘180’, ‘లవ్ ఫెయిల్యూర్’ సినిమాలు దారుణంగా దెబ్బకొట్టడంతో చూస్తుండగానే సిద్దార్ధ్ డీలాపడిపోయాడు. తర్వాత తమిళ ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేసిన అక్కడ విజయాలు దక్కలేదు. కొంతగ్యాప్ తీసుకున్న సిద్దూ ఇప్పుడు మళ్ళీ ప్రయత్నాలలో ఉన్నాడు. సిద్దూ ప్రస్తుతం ‘బిచ్చగాడు’ సినిమాతో వైవిధ్య దర్శకుడిగా పేరుతెచ్చుకున్న శశి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. జీవీ ప్రకాష్ కూడా మరొక హీరోగా నటిస్తున్న ఈ సినిమాని తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా నిర్మిస్తున్నారు.