ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెహ్రీన్ మహత్యం ఏమిటో

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 20, 2018, 12:07 PM



సాధారణంగా సినిమా పరిశ్రమలో అవకాశాలు మోసుకొచ్చేది ట్రాక్ రికార్డే. ఎన్ని విజయాలు సాధించాం అనే దాన్ని బట్టే ఇక్కడ గుర్తింపు ఉంటుంది. కానీ కొందరు మాత్రం దీనికి మినహాయింపుగా నిలుస్తారు. ఇప్పుడు మెహ్రీన్ ఇదే వరసలో ఉంది. గత ఏడాది రవితేజ తో రాజా ది గ్రేట్ శర్వానంద్ తో మహానుభావుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించాక ఇక దూసుకుపోతుందనే అనుకున్నారు అందరు. కానీ అనూహ్యంగా సాయి ధరమ్ తేజ్ తో చేసిన జవాన్ చేదు ఫలితం ఇవ్వడంతో పాటు సందీప్ కిషన్ తో తమిళ్ లో ట్రై చేసిన కేరాఫ్ సూర్య రిజల్ట్  కూడా తేడాగానే వచ్చింది. సరేపోనీలే సీనియర్ హీరో గోపిచంద్ అయినా హిట్ ఇస్తాడు అనుకుని పంతం చేస్తే అదీ పరాజయమే సొంతం చేసుకుంది. ఈ నేపధ్యంలో ఎవరికైనా అంత ఈజీగా అవకాశాలు దక్కవు. కానీ మెహ్రీన్ కు ఎక్కడో సుడి ఉన్నట్టుంది. స్లో అండ్ స్టడీ సూత్రాన్ని పాటిస్తూ మెల్లగా చిన్నా పెద్ద అవకాశాలు తన బుట్టలో వేసుకుంటోంది.


ప్రస్తుతం మెహ్రీన్ రెండు షూటింగ్స్ లో బిజీగా ఉంది. క్రేజీ మల్టీ స్టారర్ ఎఫ్ 2లో వరుణ్ తేజ్ కు జోడీగా వెంకటేష్ తమన్నా లాంటి సీనియర్లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. గతంలోనే సైన్ చేసిన నోటాలో విజయ్ దేవరకొండ హీరో కావడంతో మార్కెట్ పరంగా అది విడుదలయ్యే టైంకి పెద్ద ప్లస్ గా మారిపోతుంది. ఈ రెండు క్రేజీ సినిమాలే. ఇవి కాకుండా ఇటీవలే సుధీర్ బాబు సరసన కూడా పచ్చ జెండా ఊపిన మెహ్రీన్ అతను కూడా సమ్మోహనంతో సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు కాబట్టి మార్కెట్ బాగానే జరుగుతుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కూడా ఓకే చెప్పేసింది. ఇలా మొత్తం నాలుగు సినిమాలు తన పర్సులో దాచేసుకున్న మెహ్రీన్ కు మరో రెండు ఆఫర్లు పెండింగ్ లో ఉన్నాయట. అయినా హ్యాట్రిక్ ప్లాప్స్ వచ్చాక కూడా మెహ్రీన్ డిమాండ్ స్టాండర్డ్ గా ఉండటం చూస్తే లక్కీ గర్ల్ అనే మాట నిజమే అనిపిస్తుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com