ట్రెండింగ్
Epaper    English    தமிழ்

SSMB 30 : అర్జున్ రెడ్డి డైరెక్టర్ ని లైన్లో పెట్టిన సూపర్ స్టార్ ?

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 24, 2022, 05:22 PM



టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఛాన్స్ ఇవ్వాలే కానీ, స్క్రిప్ట్ వినిపించడానికి డైరెక్టర్లందరూ క్యూ కడతారు. కానీ, మహేష్ అందుకు ఆసక్తిని చూపించడు. పని చేసిన దర్శకులతోనే మార్చి మార్చి సినిమాలను చేస్తుంటాడు. అలాంటి మహేష్ ను డైరెక్ట్ చెయ్యడమంటే మాటలు కాదు. ముందు స్టోరీ లైన్ తో ఆయనను మెప్పిస్తే చాలు... ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. తాజాగా మహేష్ కు ఒక సాలిడ్ స్టోరీ లైన్ ను వినిపించిన అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆయన అంగీకారం కోసం వెయిట్ చేస్తున్నాడని సమాచారం. 
అర్జున్ రెడ్డి సూపర్ హిట్ అవ్వడంతో సందీప్ కు ఒక్కసారిగా స్టార్డం వచ్చింది. దీంతో స్టార్ హీరోలందరూ ఆయనతో సినిమా చెయ్యటానికి ఆసక్తిని చూపించారు. ఈ క్రమంలో ప్రభాస్, రణ్ బీర్ వంటి టాప్ హీరోలతో పనిచేసే బంపరాఫర్ ను కొట్టేసాడు. తాజాగా ఈ లిస్టులో మహేష్ కూడా చేరడంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. గతంలో ఒకట్రెండు లైన్ లను మహేష్ కు సందీప్ వినిపించాడని, మహేష్ భార్య నమ్రత సందీప్ కు టచ్ లో ఉందని పుకార్లు వినిపించాయి. మరి ఈ పుకార్లు నిజమో కాదో తెలియాలంటే, అధికారిక ప్రకటన వెలువడేంత వరకు ఆగాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com