ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాయిపల్లవి సినిమాకు నిర్మాతగా హీరో సూర్య

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 24, 2022, 06:18 PM



కెరీర్ తొలినాళ్ళనుండి గ్లామర్ రోల్స్ కు దూరంగా, నటనకు ఆస్కారమున్న పాత్రలకు దగ్గరగా ఉంటున్న సాయి పల్లవి ఇటీవలే విరాటపర్వం సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. వెన్నెలగా అద్భుతమైన నటనను ప్రదర్శించిన పల్లవి విరాటపర్వం సినిమాతో తన అభిమానగణాన్ని మరింత పెంచుకుంది.
సాయి పల్లవి నటిస్తున్న లేడి ఓరియెంటెడ్ చిత్రం గార్గి. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో బహుభాషా చిత్రంగా రూపొందుతున్న గార్గి లో సాయి పల్లవి ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఈ మూవీకి గోవింద్ వసంత్ మ్యూజిక్ అందించారు. ఏదో ఒక సమస్యలో పరిష్కారం కోసం న్యాయ పోరాటం చేస్తున్న మధ్యతరగతి యువతిగా సాయి పల్లవి ఇందులో నటించనుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో  గిని మరియు మై లెఫ్ట్ ఫుట్ ప్రొడక్షన్ బ్యానర్లపై రవిచంద్రన్ రామచంద్రన్, ఐశ్వర్య, థామస్ జార్జ్, గౌతమ్ రామచంద్రన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీని తమిళంలో సమర్పించేందుకు స్టార్ దంపతులు సూర్య, జ్యోతిక ముందుకొచ్చినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com