ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జానకీ నాయకుడితో పూజా హెగ్డే

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 24, 2017, 12:36 PM



మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన జయ జానకి నాయక ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది.  భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీలో బోయపాటి మార్కు ఫైట్స్  కారణంగా బెల్లంకొండ శ్రీనివాస్ కోరుకున్న హిట్ లభించింది. ఈ ఉత్సాహంతో లౌక్యం - డిక్టేటర్ చిత్రాల డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ తర్వాత సినిమా చేస్తున్నాడు.


జయ జానకి నాయక సినిమాకు బడ్జెట్ తో పాటు క్యాస్టింగ్ కు కూడా బాగానే ఖర్చు పెట్టారు. ప్రస్తుతం శ్రీవాస్ సినిమాకూ ఇదే సూత్రం ఫాలో అయిపోతున్నారు. దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో ఎటువంటి మొహమాటాలు పెట్టుకోకుండా తన అందచందాలతో ప్రేక్షకులకు కనువిందు చేసిన సుందరి పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ గా తీసుకున్నారు.. దువ్వాడ జగన్నాథమ్ ప్రేక్షకులను కాస్తంత నిరాశ పరిచినా హీరోయిన్ పూజా హెగ్డే  మాత్రం ఏ కోశానా ప్రేక్షకులను నిరాశపరచలేదు. అందుకే బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో ఆమెనే హీరోయిన్ గా ఎంచుకున్నారు. ఇప్పుడీ సుందరి ఆల్రెడీ బెల్లంకొండ కొత్త సినిమా షూటింగ్ కు కూడా వచ్చేసింది. ఇప్పటికే వీరి ఆన్ లొకేషన్ స్టిల్స్ నెట్లో హల్చల్ చేస్తున్నాయి. 


దీంతోపాటు ఈ సినిమాలో జగపతిబాబు - రవికిషన్ - శరత్ కుమార్ - అసుతోష్ రాణా వంటి భారీ తారాగణం నటిస్తోంది.  వీళ్లకు తోడు నిన్నటి తరం హీరోయిన్ మీనా ఓ స్పెషల్ క్యారెక్టర్ చేస్తోంది. ఇంకో స్పెషల్ రోల్ కు ఓ పెద్దనటుడిని ఒప్పించేందుకు ప్రొడ్యూసర్ ట్రై చేస్తున్నాడట. దీనిని బట్టి చూస్తుంటే బెల్లంకొండ నెక్ట్స్ సినిమా క్యాస్టింగ్ విషయంలో జయ జానకి నాయకను మించిపోయేలానే ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com