ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూతురుతో కలిసి 'వివేగం' చూసిన కమల్!

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 24, 2017, 03:07 PM



కమలహాసన్ చిన్న కూతురు అక్షర హాసన్ నటించిన 'వివేగం' ఈ రోజునే ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాతో తమిళ చిత్రపరిశ్రమకి ఆమె పరిచయమైంది. ఇదే సినిమా 'వివేకం' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడంతో, తెలుగులోను ఆమె ఈ సినిమా ద్వారానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


అజిత్ .. కాజల్ జంటగా నటించిన ఈ సినిమాలో అక్షర హాసన్ ఓ ముఖ్యమైన పాత్రను పోషించింది. ఈ సినిమాలో ఆమె నటన ఎలా వుందో చూడాలనే ఆసక్తితో, ఈ రోజు ఉదయాన్నే కూతురును వెంటబెట్టుకుని కమల్ తొలి ఆటకు వెళ్లారు. ఈ సినిమా చూసి వచ్చిన తరువాత ఆయన ఈ విషయాన్ని గురించి ట్వీట్ చేశారు. కూతురు అక్షర హాసన్ ను మెచ్చకుని ఆమెను ప్రోత్సహించినట్టు, ఈ సినిమా టీమ్ లోని వాళ్లందరికీ అభినందనలు తెలియజేసినట్టు సమాచారం.    






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com