ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అర్జున్ రెడ్డి.. కలెక్షన్లు అదరగొట్టేస్తున్నాడు

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 26, 2017, 12:36 PM



​‘అర్జున్ రెడ్డి’ విడుదల కాకముందు రేగిన వివాదం ఆ సినిమాకు చేటుగా మారుతుంది అనుకుంటే.. అందుకు భిన్నంగా పాజిటివ్ టాక్ తో, అదరగొట్టే వసూళ్లతో సాగుతోంది ఈ సినిమా. ఈ తరం దేవదాసు కథ.. అన్నట్టుగా ఈ సినిమా పాపులర్ అవుతోంది. క్రిటిక్స్ కూడా ఈ సినిమాను ప్రశంసించడం, పాజిటివ్ రివ్యూలే రావడంతో.. వీకెండ్ జోష్ ఈ సినిమాపై మళ్లింది. ఇక ఈ సినిమాతో పాటు విడుదల అయిన తమిళ అనువాద సినిమా ‘వివేకం’ అంత ఆకట్టుకోకపోవడంతో.. డైరెక్టు తెలుగు సినిమా మీదే ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తిని చూపుతున్నారు.


ఇక ఈ సినిమా ప్రీమియర్ షో వసూళ్ల వివరాలను ట్వీట్ చేశాడు ట్రేడ్ ఎనలిస్టు తరణ్ ఆదర్శ్. యూఎస్ లో గురువారం రాత్రి నుంచినే ప్రదర్శితమైన షోల్లో సాధించిన కలెక్షన్ల వివరాలను ఆయన ట్వీట్ చేశారు. మొత్తం 78 లొకేషన్లలో ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శితం అయ్యాయని.. వీటిల్లో మొత్తం కోటీ ఇరవై నాలుగు లక్షల రూపాయల వసూళ్లు వచ్చినట్టుగా తరణ్ వివరించారు.


మరి లో-బడ్జెట్ మూవీగా రూపొందిన ఈ సినిమాకు ఇవి భారీ వసూళ్లే అని చెప్పాలి. అలాగే ఈ సినిమా వీకెండ్ లో సాలిడ్ వసూళ్లను పొందే అవకాశం ఉందని తరణ్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com