శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్న మలయాళీ బ్యూటీ సాయిపల్లవి. భానుమతి క్యారెక్టర్లో ఈ అమ్మడి నటనకి ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. సాయి పల్లవి క్రేజ్ ఇప్పుడు మలయాళంలోనే కాదు తెలుగులోను విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఈ అమ్మడు నటించిన కల్ఫీ అనే మలయాళ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి ఫిదా మూవీలోని సూపర్ హిట్ పాటలో వచ్చే 'హేయ్ పిల్లగాడ' అనే లిరిక్స్ ను టైటిల్ గా ఫిక్స్ చేశారు. తాజాగా చిత్ర టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండడంతో పాటు మూవీపై భారీ అంచనాలు పెంచింది. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో కల్ఫీ చిత్రం తెరకెక్కగా డివి కృష్ణ స్వామి డబ్బింగ్ రైట్స్ దక్కించుకున్నాడు. త్వరలోనే ఈ సినిమాని తెలుగులో విడుదల చేయనున్నారు. సమీర్ తాహిర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. మరి ఫిదా లిరిక్స్ ని మూవీ టైటిల్ గా పెట్టిన చిత్ర యూనిట్ ఎంత వరకు లాభాలు రాబడుతుందో చూడాలి.