షాహిద్ కపూర్, మీర్జా రాజ్పుత్ దంపతులకు ఆగస్ట్ 26, 2016 సాయంత్రం 7:56 ని.లకు మిషా కపూర్ అనే పండంటి బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఈ రోజు మిషా ఫస్ట్ బర్త్డే కావడంతో షాహిద్ కపూర్ దంపతులు తమ కూతురి బర్త్ డే వేడుకలను లండన్ లో నిర్వహిస్తున్నారు. ఇక ఒక రోజు ముందు రంగూన్ హీరో కూతురి ప్రీ లుక్ ఫోటో విడుదల చేసి తన ఆనందాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు. మిషా పుట్టినప్పటి నుండి కూతురికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ తన అభిమానులని ఫుల్ ఎంటర్టైన్ చేశాడు షాహిద్ కపూర్. ప్రస్తుతం షాహిద్ పద్మావతి అనే చిత్రంలో నటిస్తుండగా, ఈ మూవీ కోసం కత్తి యుద్ధాలు, మార్షల్ ఆర్ట్స్ పై పట్టు సాధిస్తున్నట్టు తెలుస్తుంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్ కూడా నటిస్తున్నారు.