అర్జున్ రెడ్డి సినిమా బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతుండటంతో ఆ సినిమా ఇచ్చిన కిక్‌ని ఆస్వాదిస్తున్న విజయ్ దేవరకొండ తాజాగా చేసిన ఓ ఫేస్బుక్ పోస్ట్ ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో చర్చనియాంశమైంది. అర్జున్ రెడ్డి సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలు చాలా వున్నాయని, ఆ సన్నివేశాలు నేటి యువతని చెడుదోవ పట్టిస్తాయని అభ్యంతరం వ్యక్తంచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంత రావు.. వెంటనే అర్జున్ రెడ్డి సినిమా ప్రదర్శనని నిలిపివేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
వీహెచ్ చేసిన ఈ డిమాండ్ చర్చకు దారితీసిన ప్రస్తుత నేపథ్యంలో తాతయ్య అని సంబోధిస్తూ విజయ్ దేవరకొండ తన ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్ట్ రాసుకొచ్చాడు. మీరు ఆరోపించినట్టుగా కేటీఆర్ తన సినిమాని అభినందించినందుకే కేటీఆర్ తనకి బంధువవుతారనుకుంటే.. అదే సమయంలో తనని అభినందించిన ఎస్ఎస్ రాజమౌళి తనకి తండ్రి లాంటివారు అవుతారని, హీరోలు శర్వానంద్, రానా దగ్గుబాటి వాళ్లంతా సోదరులవుతారని ఎద్దేవా చేశాడు విజయ్ దేవరకొండ.
అంతటితో ఆగకుండా.. అర్జున్ రెడ్డి సినిమాను ప్రశంసించిన హీరోయిన్స్ సమంత, అను ఇమ్మాన్యుయెల్, మెహ్రీన్ లాంటివాళ్లంతా తనకి మరదళ్లు అవుతారని తన పోస్టులో పేర్కొన్నాడు విజయ్ దేవరకొండ.
అయితే, వీహెచ్ చేసిన కామెంట్స్‌కి పరోక్షంగా విజయ్ దేవరకొండ ఇచ్చిన ఈ రిప్లై ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. మంత్రి కేటీఆర్, రాజమౌళి, రానా దగ్గుబాటి, శర్వానంద్ లాంటి వాళ్ల గురించి ప్రస్తావించిన తీరు పర్వాలేదు కానీ రేపోమాపో చైతూని పెళ్లి చేసుకుని అక్కినేని వారింటికి కోడలిగా వెళ్లనున్న సమంతని మరదలు అని సంబోధించడం ఏంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.
విజయ్ దేవరకొండ చేసిన ఈ ఫేస్బుక్ పోస్ట్ అతి కొద్ది నిమిషాల్లోనే దాదాపు 1,000కిపైగా షేర్స్, వేలల్లో లైక్స్, కామెంట్స్‌ని సొంతం చేసుకుంది. ఈ ఫేస్బుక్ పోస్టుపై సినీ సెలబ్రిటీలు ఏమని స్పందిస్తారో చూడాలి మరి.