ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిగరెట్ వెలిగిస్తూ ఎన్టీఆర్ బయోపిక్ లో అక్కినేని పోస్టర్

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 20, 2018, 04:46 PM



ఎన్టీఆర్ ఏఎన్నార్ కథానాయకులుగా ఇద్దరూ ఇద్దరే. పౌరాణిక చిత్రాల్లో తనకి తిరుగులేదని ఎన్టీ రామారావు నిరూపిస్తే , సాంఘిక చిత్రాల్లో ఏఎన్నార్ అదరగొట్టేశారు. సోలో హీరోలుగా వరుస సినిమాలు చేస్తూనే అవకాశం దొరికినప్పుడల్లా కలిసి నటించారు. విజయాలను అందుకునే విషయంలో పోటీపడుతూనే ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. అందువలన 'ఎన్టీఆర్' బయోపిక్ లో ఏఎన్నార్ పాత్ర కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది.


ఈ రోజున ఏఎన్నార్ జయంతి కావడంతో, ఈ సినిమాలో ఏఎన్నార్ పాత్రను పోషిస్తోన్న సుమంత్ లుక్ ను ఉదయం రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ కి సంబంధించిన పాత స్టిల్స్ ను చూస్తే ఒకచోట ఎన్టీఆర్ సిగరెట్ ను వెలిగిస్తూ అక్కినేని కనిపిస్తారు. ఈ ఫోటో వాళ్ల సాన్నిహిత్యానికి అద్దం పడుతుంది .. అదే స్టిల్ ను పోస్టర్ గా రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ గా బాలకృష్ణ .. అక్కినేనిగా సుమంత్ ఎంతగా కుదిరారనేది ఈ పోస్టర్లో కనిపిస్తోంది .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com