ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాకు ఇష్టమైన పదార్థాలన్నీ ఇలా తినిపిస్తాడు

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 24, 2018, 12:19 PM



చిన్న నాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకున్నాడు రామ్ చరణ్. క్లాస్ మేట్ ఉపాసన కామినేనిని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోగా క్షణం తీరిక లేకుండా కెరీర్ పరంగా బిజీగా ఉండే చరణ్ కి అన్నీ తానే అవుతోంది ఉపాసన. ఓవైపు అపోలో వ్యవహారాలు చక్కబెడుతూనే - మరోవైపు చెర్రీ ఎక్కడ ఉంటే అక్కడ తాను కూడా ఆన్ లొకేషన్ విజిట్స్ చేస్తూ తనతో సరదా సరదాగా గడిపేస్తుంది. ఇక ఉపాసన తో ప్రతి స్వీట్ మూవ్మెంట్ ని చరణ్ ఎంజాయ్ చేస్తుంటారు. ఇదివరకూ గోదారి పరిసరాల్లో మండే ఎండల్లో చరణ్ అలుపెరగకుండా శ్రమిస్తున్నప్పుడు ఉపాసన తనే దగ్గరుండి కేర్ తీసుకున్నారు. మత్స్యకార విలేజర్స్ తో అప్పట్లో ఫోటోలు దిగి ఉపాసన సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.


పైగా ఈ ఇద్దరూ ఫిట్ నెస్ ఫ్రీక్స్. నిరంతరం జిమ్ములోనే గడుపుతుంటారు. అక్కడ  నుంచి కొన్ని సెల్ఫీలు - ఫోటోలు సామాజిక మాధ్యమంలో లైవ్ అవుతుంటాయి. ఇక ఉపాసన బొద్దుతనం నుంచి పూర్తి ఫిట్ గా మారిపోవడానికి ఎంతగా శ్రమించారో తెలిసిందే. ఇప్పుడు స్లిమ్ లుక్ లో కనిపిస్తూ అందరిలో స్ఫూర్తి నింపుతున్నారు. అయితే ఉపాసన ఇలా మారడం వెనక చెర్రీ ఇచ్చిన టిప్స్ ఎంతో ఉపయోగపడ్డాయట. పూర్తిగా స్వీట్లు తినడం ఆపేయడం - కొలెస్టరాల్ డైట్ కి దూరంగా ఉండడంతోనే ఈ లుక్ సాధ్యమైంది.


తాజాగా ఉపాసన ఓ వీడియోని - కొన్ని ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి ఆసక్తికర కామెంట్ ని ట్వీట్ చేశారు. ``ఇపుడు నాకు ఇష్టమైన పదార్థాలన్నీ ఇలా తినిపిస్తాడు - తర్వాత జిమ్ లో చంపుతాడు. అమేజింగ్ సండే సర్క్యూట్ విత్ మిస్టర్ సి`` అంటూ ఉపాసన ట్వీట్ చేశారు. అంటే స్వీట్ తినిపించినట్టే తినిపించి - తిరిగి వర్కవుట్లు చేయమని చంపుతాడన్నమాట. కష్టే ఫలి. ఎంత కష్టిస్తే అంత శ్వేధం బయటకు వెళుతుంది. శారీరక వ్యాయమం మంచికే.  చరణ్- ఉపాసన మెగాస్టార్ చిరంజీవి కెరీర్ నాలుగు దశాబ్ధాలు పూర్తి చేసుకుని 41వ ఏడాదిలో అడుగుపెట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. చెర్రీ డాడ్ చిరుతో ఉన్నప్పటి మూవ్ మెంట్ ని సామాజిక మాధ్యమాల్లో ఫోటోల రూపంలో షేర్ చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com