ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హీరోయిన్ న్యూడ్ క్లిప్ ను వాళ్ళమ్మకే పంపారట

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 24, 2018, 12:21 PM



పరిచయం అవసరం లేని పేరు రాధిక ఆప్టే.  బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న రాధిక నటన విషయంలోనే కాదు నిజజీవితంలో తన అభిప్రాయలను కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తుంది. అప్పుడప్పుడు అవి వివాదాలకు దారి తీస్తుంటాయి కూడా.  అయినా ఆమె అలాంటివేవీ పట్టించుకోదు.రాధిక కు న్యూడ్ సీన్స్ లో నటించడం కొత్తేమీ కాదు. 2015 లో అనురాగ్ కశ్యప్ షార్ట్ ఫిలిం 'మ్యాడ్లీ' లో నగ్నంగా నటించింది.  అప్పట్లో లీకయిన ఆ న్యూడ్ క్లిప్ వాట్సాప్ లో విపరీతంగా చక్కర్లు కొట్టింది.  ఇక 2016 లో 'పార్చ్ డ్' సినిమాలో మరో సారి హాట్ గా ఉండే న్యూడ్ సీన్స్ లో యాక్ట్ చేసింది. దీన్లో ఆదిల్ హుస్సేన్ తో కలిసి నటించిన న్యూడ్ సీన్ లీక్ అయ్యి సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది.


రాధిక ఈమధ్య అనైతా ష్రాఫ్ నిర్వహించే 'ఫీట్ అప్' అనే షోలో పాల్గొంది. అక్కడ ఇలాంటి వాటిగురించి మాట్లాడుతూ "నాకు అసలు లీక్స్ గురించి తెలీదు.  మా అమ్మ చెప్పింది.  ఎవరో ఆ న్యూడ్ వీడియోను అమ్మ కు పంపారట.  దాంతో షాక్ అయ్యా. మొదటి సారి అలా జరగడంతో పిచ్చెక్కినట్టయింది."  ఇక మరోసారి తన డ్రైవర్ లీకయిన క్లిప్స్ గురించి చెప్పాడట.   ఇక ఇప్పుడు అందరికీ తెలిసిందే కాబట్టి అలాంటి వాటి గురించి పట్టించుకోవడం మానేసినట్టు చెప్పింది మహా బోల్డ్ ఆప్టే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com