‘క్వాంటాస్ ఎయిర్‌లైన్స్‌లో నాకు ఎదురైన అనుభవం ఇది. ఈ ఘటన గురించి ముఖ్యంగా క్వాంటాస్ ఎయిర్‌లైన్స్ అధికారులు తెలుసుకోవాలని బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తెలిపింది. చెకిన్ కౌంటర్లో మెల్ అనే ఉద్యోగిని నన్ను అడ్డుకుంది. నేను భారతీయురాలిని కాబట్టి ఎలా మాట్లాడినా ఫర్వాలేదనుకుందో ఏమో. నా వద్ద కేవలం రెండు బ్యాగులు మాత్రమే ఉన్నాయి. కానీ మెల్ నా రెండు బ్యాగుల్లో ఒక బ్యాగు ఓవర్‌సైజ్ ఉందని చెప్పింది. దాంతో మరో కౌంటర్ వద్దకు నన్ను పంపించింది. ఇదంతా చెకిన్ కౌంటర్ మూసేయడానికి ఐదు నిమిషాలకు ముందు జరిగిన ఘటన. అక్కడే ఉన్న మరో ఉద్యోగిని నాతో మర్యాదగానే మాట్లాడింది. ఆమె ఓవర్‌సైజ్ లగేజ్ లేదని ఎంత చెప్తున్నా వినకుండా మెల్ నన్ను అక్కడే కూర్చోబెట్టింది. నాకు ఆలస్యం అవుతుండడంతో మరో ఓవర్‌సైజ్ బ్యాగేజ్ కౌంటర్ వద్దకు వెళ్లి నా బ్యాగును ఇచ్చి వచ్చాను. ప్రయాణికులు ఏ జాతికి చెందిన వారైనా వారితో మర్యాదగా మాట్లాడాలని క్వాంటాస్ ఎయిర్‌లైన్స్ సిబ్బందికి నేర్పించాలని కోరుకుంటున్నానని వెల్లడిస్తూ తన బ్యాగుతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేసింది.