ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించిన తమిళ, తెలుగు మూవీ నవాబ్.. ఈ మూవీలో అరవింద స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, ప్రకాష్ రాజ్, సలామ్ సర్, జ్యోతిక, అదితిరావు హైదరీ తదితరులు నటించారు..ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్నది.. ఈ మూవీని ఈ నెల 27న రిలీజ్ చేయనున్నారు… లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై రూపొందిన ఈ మూవీకి ఎ ఆర్ రెహ్మాన్ సంగీతం, సంతోష శివన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ , సీతారామశాస్త్రీ పాటలు అందిస్తున్నారు.. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.. ఈ వేడుకలో చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.