ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ సరసన ఛాన్స్ కొట్టిన కుమారి!

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 01, 2017, 09:42 AM



కుమారి 21 ఎఫ్ తో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరిపోయింది హాట్ బ్యూటీ హెబ్బా పటేల్. గ్లామర్ షోకి ఎలాంటి పరిమితులు పెట్టని హెబ్బాకి కుమారి 21 ఎఫ్ తరువాత ఆఫర్లు వెల్లువలా వచ్చాయి. అయితే ఎక్కువుగా మీడియం రేంజ్ హీరోలతోనే జోడికట్టిన హెబ్బాపటేల్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని మాత్రం ఇంతవరుకు అందుకోలేదు. లవకుశలో జూనియర్ యన్టీఆర్ సరసన నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి లాస్ట్ మినిట్ లో హెబ్బా చేజారిపోయింది. దానికి తోడు కుమారి 21 ఎఫ్ తురువాత వరుస హిట్లు కొట్టిన హెబ్బాకి తాజాగా ఫ్లాపులు పడ్డాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న మిస్టర్ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. 


ప్రస్తుతం హబ్బా నుంచి కేవలం ఒకే ఒక్క తెలుగు సినిమా పెండింగ్ ఉంది. దాదాపు సంవత్సరం నుంచి షూటింగ్ జరుపుకుంటా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ టెబుల్ మీద ఉన్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ ఏంజెల్ లో హెబ్బా ఓ వినూత్నమైన పాత్రలో కనిపించబోతుందని టాక్. ఈ సినిమా సక్సెస్ అయితే హెబ్బాకి మళ్లీ తెలుగులో అవకాశాలు పుంజుకుంటాయి. అయితే తెలుగులో అవకాశాలు తగ్గాయని గ్రహించిన ఈ బాంబే బ్యూటీ తమిళంలో పాగా వేసేందుకు చాలా రోజులు నుంచి ట్రై చేస్తుంది. తమిళ సూపర్ స్టార్ విజయ్ అప్ కమింగ్ మూవీలో నటించే అవకాశం హెబ్బాను వరించిందని తాజాగా ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి. అలానే తమిళనాట ఉన్న మరో స్టార్ హీరో విజయ్ సేథుపతి నెక్ట్స్ మూవీలో కూడా హెబ్బా నటించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందని సమాచారం. మరి ఇద్దరు విజయ్ లతో తమిళంలోకి అడుగుపెట్టబోతున్న హెబ్బాకి విజయం చేకూరుతుందో లేదో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com