మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ల మధ్య దూరం ఇప్పటికీ అలానే ఉందని, అందుకే మెగా ఫ్యామిలీలో జరిగే వేడుకలకి పవన్ హాజరు కావడం లేదని కొద్ది రోజులుగా అవాస్తవ ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన చిరు బర్త్‌డే వేడుకలలోను పవన్ పాల్గొనలేదని గాసిప్ రాయుళ్ళు పుకార్లు పుట్టించారు. ఇండస్ట్రీలకి సంబంధించిన సెలబ్రిటీలు , ప్రముఖ రాజకీయ నాయకులు సోషల్ మీడియాలో చిరుకి బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.
కాని పవన్ కళ్యాణ్ మాత్రం చిరు బర్త్‌డే వేడుకకి హాజరు కాకపోగా, కనీసం సోషల్ మీడియాలోను తన అన్నయ్యకి విషెస్ చెప్పలేదని ఫ్యాన్స్ తెగ ఫీలయ్యారు. ఇలాంటి వార్తల నేపథ్యంలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ .. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆత్మీయంగా ఉన్న ఫోటో పోస్ట్ చేసి 'బాబాయే అబ్బాయి అయితే?... కాదు బాబాయి కూడా అబ్బాయే....! అని కామెంట్ పెట్టి అందరిలో ఉన్న అనుమానాలకి పులిస్టాప్ పెట్టాడు. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే రోజు పవన్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ సందర్భంలో దిగిన ఫోటోనే ఇది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. ఏదేమైన పవన్ బర్త్‌డే రోజు మెగా అభిమానుల ఆనందాన్నితేజూ పదింతలు పెంచాడనే చెప్పవచ్చు.