బాలకృష్ణ స‌ర‌స‌న మ‌రో మ‌ల‌యాళం భామ‌

  Written by : Suryaa Desk Updated: Mon, Sep 04, 2017, 12:58 PM
 

న‌టసింహ నంద‌మూరి బాల‌కృష్ణ త‌న 102వ మూవీని కె ఎస్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు.. ఆగష్టు ఆరంభంలో మొదలైన ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాలో బాలయ్య సరసన మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ప్ర‌ధాన హీరోయిన్ గా నయనతార ను తీసుకున్నాడు.. ఇక మ‌రో హీరోయిన్ గా మ‌ల‌యాళం హీరోయిన్ న‌టాషా దోషిని ఎంపిక చేశారు. దోషి మలయాళంలో ‘హైడ్ అండ్ సీక్, నయన, కాల్ మీ @’ వంటి చిత్రాల్లో నటించింది.. పాత్ర ప‌రంగా అమె సూట్ అవుతుంద‌ని భావించిన ద‌ర్శ‌కుడు ఈ అవ‌కాశం ఇచ్చిన‌ట్లు స‌మాచారం.. మ‌రో హీరోయిన్ ఎంపిక కూడా త్వ‌ర‌లోనూ చేయ‌నున్నారు..ఈ మూవీ వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుంది.
Recent Post