ఫ్యాషన్ ఇండస్ట్రీలో బాలీవుడ్ సీనియర్ నటి సుస్మితాసేన్ ఓ కింగ్ మేకర్. విశ్వసుందరిగా ఫ్యాషన్ ప్రపంచంలో తనకు ఉన్న అనుభవాన్ని రంగరించి ఈ రంగంలో ఎందరినో తయారు చేసేందుకు సొంతంగా ఫ్యాషన్ శిక్షణ ఇనిస్టిట్యూట్ ని స్థాపించింది. ముంబై నగరం సహా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఫ్యాషన్ ఈవెంట్ జరిగినా సుష్ స్టూడెంట్స్ అక్కడ తప్పనిసరిగా పెర్ ఫామ్ చేస్తుంటారు. అయితే ఇదిగో ఇటీవలే ఓ ఈవెంట్ లో తాను కూడా చిలకాకుపచ్చ డిజైనర్ డ్రెస్ లో ర్యాంప్ వాక్ చేస్తూ తళుక్కుమంది. ఆమె తలకు చుట్టిన ఆ రాజస్థానీ స్టైల్ తలపాగా సంథింగ్ స్పెషల్గా ఆకట్టుకుంటోంది. జ్యోతి ముఖర్జీ .. భూమిక డిజైనర్ షోలో షో స్టాపర్ గా నిలిచింది సుశ్మితాసేన్.