ఎన్టీఆర్ హీరోగా విడుదలైన ‘అరవింద సమేత వీర రాఘవ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఓవర్సీస్ లో ఈ మూవీ సరికొత్త రికార్డ్ లు సృష్టిస్తున్నది. మరే తెలుగు హీరోకూ సాధ్యంకాని ఓ రికార్డును ఎన్టీఆర్ సొంతం చేసింది. వరుసగా నాలుగు మూవీలు వంద కోట్లను రాబట్టిన హీరోగా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించాడు.. గత గురువారం విడుదలైన ఈ మూవీ ఆదివారం నాటికే ఏకంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో రూ 100 కోట్ల గ్రాస్ రాబట్టింది.. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ మూవీలు కూడా వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాయి.. దక్షిణాదిలో విజయ్, రజనీకాంత్ లు మాత్రమే వరుసగా మూడు సినిమాలు వంద కోట్లు సాధిస్తే, ఎన్టీఆర్ ఏకంగా నాలుగు సినిమాలు వంద కోట్లు రాబట్టిన తొలి దక్షిణాది హీరోగా నిలిచాడు. ఈ మూవీ అమెరికాలో ఇప్పటికే సుమారు 1.7 మిలియన్ డాలర్లను (దాదాపు రూ. 12.50 కోట్లు) వసూలు చేసింది. త్రివిక్రమ్క విక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వ వహించిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్.. థమన్ సంగీతం సమకూర్చాడు. హారికా, హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు ఈ మూవీని నిర్మించాడు.