బోల్డ్ లుక్‌లో యూత్ మ‌న‌సులు కొల్ల‌గొట్టిన రాయ్ ల‌క్ష్మీ

  Written by : Suryaa Desk Updated: Mon, Sep 04, 2017, 03:07 PM
 

త‌న గ్లామ‌ర్ షోతో యూత్ కి బాగా క‌నెక్ట్ అయిన అందాల భామ రాయ్ ల‌క్ష్మీ. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాలు చేస్తూ గ్లామర్ పరంగా రాయ్ లక్ష్మి మంచి మార్కులు కొట్టేసింది. ఇక బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌ల కంట్లోను ప‌డ్డ ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం జూలి 2 అనే సినిమా చేస్తుంది. నేహ ధూపియా ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన‌ జూలికి సీక్వెల్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని శివ‌దాసాన్ని రూపొందిస్తున్నాడు.

అక్టోబ‌ర్ 6న ఈ చిత్రం థియేట‌ర్స్ లోకి రానుండగా, తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో రాయ్ త‌న అందాల‌తో యూత్ కి మ‌త్తెక్కిస్తుంది. చిత్రంలో రాయ్ ల‌క్ష్మీ స్పెష‌ల్ అప్పీయ‌రెన్స్ ఇవ్వ‌నుండ‌గా .. ర‌తి అగ్నిహోత్రి, సాహిల్ సలాతియా, ఆదిత్య శ్రీ వాస్త‌వ‌, ర‌వి కిష‌న్, పంక‌జ్ త్రిపాఠి, నిషికాంత్ కామంత్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు . బాలీవుడ్ లో ఉన్న చీక‌టి కోణంతో పాటు అండ‌ర్ వ‌ర‌ల్డ్ మ‌రియు రాజ‌కీయాల‌లో ఉన్న న‌గ్న స‌త్యాన్ని తెలిపేలా ఈ మూవీ ఉంటుంద‌ని తెలుస్తుంది. మ‌రి తాజాగా విడుద‌లైన జూలీ 2 ట్రైల‌ర్ పై మీరు ఓ లుక్కేయండి.
Recent Post