శ్రియ.. భలే భలే ఎగురుతోందోయ్!!

  Written by : Suryaa Desk Updated: Tue, Sep 05, 2017, 01:58 PM
 

టాలీవుడ్ బ్యూటీ శ్రియా శరణ్ కు సౌత్ అంతా క్రేజ్ ఉంటుంది. ఆ మాటకొస్తే.. నార్త్ లో కూడా కొన్ని సినిమాలతో బాగానే ఆకట్టుకుంది ఈ భామ. ఇంకో రెండేళ్లు గడిస్తే ఇండస్ట్రీలోకి వచ్చి ఈమె 20 వసంతాలు పూర్తి చేసుకున్న రికార్డ్ కూడా సృష్టించేస్తుంది. ఇంతకాలం పాటు హీరోయిన్ గా కంటిన్యూ అవుతుండడమే అన్నిటికంటే పెద్ద రికార్డ్ అని చెప్పాలి.


ఈ ఏడాది ఇప్పటికే గౌతమి పుత్ర శాతకర్ణి.. పైసా వసూల్ చిత్రాలలో హీరోయిన్ గా కనిపించిన శ్రియ.. నక్షత్రం మూవీలో ఐటెమ్ సాంగ్ లో కూడా నర్తించింది. ఇప్పుడు కుర్ర హీరోలతో కూడా కలిసి సినిమా చేసేస్తోంది. వీర భోగ వసంత రాయలు అనే టైటిల్ పై రూపొందుతున్న మూవీలో నారా రోహిత్.. సుధీర్ బాబు నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో శ్రియ కనిపించనుంది. అయితే.. స్టోరీ ప్రకారం అసలు ఈ మూవీలో హీరో.. హీరోయిన్.. ఇలాంటి వేరియేషన్స్ ఉండవని అంటున్నారు మేకర్స్. సినిమాలో ఉండే ప్రతీ నటుల చుట్టూ అల్లుకున్న ప్లాంట్ హైలైట్ గా నిలవడనుండగా.. శ్రియ పాత్ర ఇందులో కీలకంగా కనిపించనుందని తెలుస్తోంది


ఓ ఎయిర్ హోస్టెస్ రోల్ లో శ్రియా శరణ్ కనిపించనుంది. మూవీకి బేస్ గా నిలిచే ప్రధానమైన రోల్ ఇదే కావడంతోనే సీనియర్ యాక్ట్రెస్ ను తీసుకున్నారట. ఈ పాత్రలో నటించేందుకు.. ఎయిర్ హోస్టెస్ గా పర్ఫెక్ట్ లుక్ చూపించేందుకు.. శ్రియ చాలానే కష్టపడిందని.. స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుందని అంటున్నారు. కొత్త దర్శకుడు ఇంద్రసేన.. ఈ చిత్రంతో పరిచయం అవుతున్నాడు. సొసైటీలో అంతర్లీనంగా ఉండే చెడునే ఈ మూవీలో చూపించబోతున్నారని టాక్. 
Recent Post