ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘ఆఫర్ ఇస్తా.. మరి నాకేంటి?’ అన్నాడు

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 19, 2018, 11:25 AM



పాయల్ రాజ్‌పుత్‌ పేరు చెబితే తెలుగు రాష్ట్రాల యూత్ ఊగిపోతుంది. ఎందుకంటే ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంలో ఆమె చేసిన పాత్ర అలాంటిది. తెర మీద బోల్డ్‌ సన్నివేశాలను ఎంత ధైర్యంగా చేస్తుందో బయట అంతకు రెట్టింపు ధైర్యంగా ఉంటుంది. మొదటి సినిమాలో ముద్దు సన్నివేశాలు చేశాను కనుక అన్నీ అలాంటివే చేయమంటే చేయననీ, తను పక్కా ప్రొఫెషనల్ని అంటున్న పాయల్‌ రాజ్‌పుత్‌ని.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కాస్ట్‌ కౌచింగ్‌ మీకూ ఎదురైందట కదా? అని అడిగితే ఈ విధంగా సమాధానం చెప్పుకొచ్చింది.


 ‘‘టాలీవుడ్‌లో కాస్ట్‌ కౌచింగ్‌ ఉంది. అది బహిరంగ రహస్యమే. అయితే నటిగా నిరూపించుకున్న తరువాత కూడా ఈ కాస్ట్‌ కౌచింగ్‌ భూతం నన్ను వీడకపోవడం బాధిస్తోంది. ‘ఆర్‌ఎక్స్‌100’ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ చేయడం వల్లనే వేధింపులు ఎదురవుతున్నాయని అనుకుంటున్నాను. సినిమా తరువాత అలాంటి ఆఫర్లే వస్తున్నాయి. ఇటీవల అలాంటి ఆఫర్‌తో నన్ను ఒకతను కలిశారు. ‘ఆఫర్ ఇస్తా.. మరి నాకేంటి?’ అన్నాడు. నేను షాకయ్యా. గట్టిగా రెండు చెంపలు వాయించాలని అనిపించింది. ఆ సమయంలో నన్ను నేను కంట్రోల్‌ చేసుకోవడానికి చాలా కష్టపడ్డాను. నటిగా నేను ఇక్కడ నిలబడ్డాను అంటే అది నా టాలెంట్‌ను బట్టే కానీ, ముద్దు సన్నివేశాల్లో నటించినందుకు నాకు గుర్తింపు రాలేదంటూ ఆ ఆఫర్‌ని తిరస్కరించా..’’ అంటూ పాయల్ రాజ్‌పుత్ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com